ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అచ్చెన్న బెయిల్ పిటిషన్‌.. నేడు సోంపేట న్యాయస్థానంలో విచారణ - Achennaidu arrest news

నేడు శ్రీకాకుళం జిల్లా సోంపేట కోర్టులో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరగనుంది. కస్టడీ కోరుతూ కోటబొమ్మాళి పోలీసులు వేసిన పిటిషన్‌ తో కలిపి.. మొత్తం రెండు వ్యాజ్యాలను ఈరోజు ధర్మాసనం విచారించనుంది.

Achenna's bail petition to be heard in Sompeta court today
నేడు సోంపేట కోర్టులో అచ్చెన్నా బెయిల్ పిటిషన్‌పై విచారణ

By

Published : Feb 4, 2021, 10:12 AM IST

తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బెయిల్‌ పిటిషన్‌పై ఇవాళ శ్రీకాకుళం జిల్లా సోంపేట కోర్టులో విచారణ జరగనుంది. ఆయన తరఫు న్యాయవాది గొర్లె రామారావు.. సోంపేట న్యాయస్థానంలో నిన్న బెయిల్‌ పిటిషన్‌ వేశారు. మరోవైపు... అచ్చెన్నను కస్టడీకి కోరుతూ కోటబొమ్మాళి పోలీసులు సైతం సోంపేట కోర్టులోనే పిటిషన్‌ వేశారు.

ఈ 2 పిటిషన్లపై నేడు విచారణ జరగనుంది. నిమ్మాడలో నామినేషన్‌ వేసే క్రమంలో వైకాపా, తెదేపా నేతల వివాదం కేసులో అచ్చెన్న 2వతేదీన అరెస్టు కాగా ప్రస్తుతం అంపోలు జైలులో రిమాండ్‌లో ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details