ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వ్యక్తిగత జీవితానికి భంగం కలిగించే హక్కు పోలీసులకు ఎవరిచ్చారు' - తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గహనిర్బంధం

తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. పలాసలో గౌతు లచ్చన్న విగ్రహం తొలగిస్తామని మంత్రి సీదిరి అప్పలరాజు వ్యాఖ్యలను నిరసిస్తూ పలాసలో జరగబోయే నిరసన కార్యక్రమంలో అచ్చెన్నాయుడు పాల్గొంటారన్న సమాచారంతో పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై అచ్చెన్నాయుడు మండిపడ్డారు.

achennaidu house arrest
achennaidu house arrest

By

Published : Dec 24, 2020, 1:21 PM IST

శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడుని పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. పలాసలో గౌతు లచ్చన్న విగ్రహం తొలగిస్తామని మంత్రి సీదిరి అప్పలరాజు వ్యాఖ్యలను నిరసిస్తూ పలాసలో జరగబోయే నిరసన కార్యక్రమంలో అచ్చెన్నాయుడు పాల్గొంటారన్న సమాచారంతో పోలీసులు అడ్డుకున్నారు. గ్రామస్తులు అచ్చెన్నాయుడు నివాసానికి చేరుకుని పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అప్పటికప్పుడు పోలీసులు అచ్చెన్నాయుడుని గృహ నిర్బంధంలో ఉంచుతున్నట్లు నోటీసులు ఇచ్చారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది.

పోలీసుల తీరుపై అచ్చెన్నాయుడు మండిపడ్డారు. తన వ్యక్తి గత జీవితానికి భంగంకలిగించే హక్కు పోలీసులకు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ అధికార పార్టీకి కొమ్ముకాస్తుందన్నారు. కోర్టులు ఎన్నిసార్లు మొట్టికాయలు వేస్తున్నా పరిస్థితిలో మార్పు రావడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. లచ్చన్న విగ్రహాన్ని కూలుస్తానన్న మంత్రి సీదిరి అప్పలరాజు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి నిర్లక్ష్యం మహిళల పాలిట శాపంగా మారిందని అచ్చెన్నాయుడు ఆరోపించారు. ప్రభుత్వ ఉదాసీనత వల్లే రాష్ట్రంలో ప్రేమోన్మాదులు పేట్రేగిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో ప్రేమోన్మాదుల చేతిలో దళిత యువతి స్నేహలత బలైపోవడం ఎంతో కలిచివేసిందన్నారు. వేధింపులపై యువతి తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం వల్లే ఇంతటి అఘాయిత్యం జరిగిందన్నారు. ఘటన జరిగి 24 గంటలు గడిచినా.. ప్రభుత్వం, పోలీసులు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. స్నేహలతను దారుణంగా హతమార్చిన నిందితులను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. స్నేహలత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:పలాసలో ఉద్రికత్త.. నిరసనకు తెదేపా పిలుపుతో నేతల గృహ నిర్బంధం

ABOUT THE AUTHOR

...view details