శ్రీకాకుళం నుంచి మరో వ్యక్తి సభాపతిగా ఎన్నిక కావడంపై టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఆనందం వ్యక్తం చేశారు. ఎంతో అనుభవం ఉన్నతమ్మినేని లాంటి వ్యక్తిఅధికార, ప్రతిపక్షానికి సమాన ప్రాధాన్యత ఇస్తూ సభను సమర్థవంతంగా నడపాలని కోరారు. ఈ క్రమంలోనే వైకాపా తీరును ఆయన తప్పుపట్టారు.సభాపతిని ఆయన స్థానంలో కూర్చోబెట్టే సమయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబును ఆహ్వానించలేదన్నారు. సంప్రదాయాలను అధికార పార్టీ పాటించలేదని విమర్శించారు. కనీసం తమ్మినేని ఎంపికైన విషయాన్ని తెలియజేయలేదని... ప్రతిపక్షనేతగా జగన్ ఎంతో గౌరవం ఇచ్చామని... నేడు మాత్రం వైకాపా అవమానకరంగా ప్రవర్తిస్తుందని ధ్వజమెత్తారు.
చంద్రబాబుని పిలవకుండా అవమానించారు - achenaiudu
అధికార పక్షం వైకాపా... ప్రతిపక్షానికి తగిన గౌరవం ఇవ్వలేదని అచ్చెన్నాయుడు వాపోయారు. స్పీకర్ని స్థానంలో కూర్చోబెట్టేప్పుడు కనీసం ప్రతిపక్షనేత చంద్రబాబును పిలవలేదన్నారు. తెదేపా హయాంలో ఎప్పుడూ సంప్రదాయాలు పక్కన పెట్టలేదని గుర్తు చేశారు. స్పీకర్గా ఎన్నికైన తమ్మినేని సీతారాంకు అభినందనలు తెలిపారు.
అచ్చెన్నాయుడు