ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మాజీమంత్రి అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్‌ కొట్టివేసిన హైకోర్టు - అచ్చెన్నాయుడు కేసుపై వార్తలు

achennaidu bail rejected
మాజీమంత్రి అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్‌ కొట్టివేసిన హైకోర్టు

By

Published : Jul 29, 2020, 11:10 AM IST

Updated : Jul 29, 2020, 2:48 PM IST

11:09 July 29

అచ్చెన్న సహా ఈఎస్​ఐ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి బెయిల్​ పిటిషన్లు కొట్టివేత

మాజీమంత్రి అచ్చెన్నాయుడు బెయిల్ పిటీషన్ ను హైకోర్టు కొట్టివేసింది . ఆయనతోపాటు ఈఎస్ఐ కేసులో అరెస్ట్ అయిన మరికొంతమంది నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటీషన్లను సైతం కొట్టివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఈఎస్​ఐ ఔషధాల కొనుగోలు, కాల్ సెంటర్ల కాంట్రాక్ట్​లో అవకతవకలు జరిగాయని మాజీమంత్రి అచ్చెన్నాయుడు, మాజీ ఈఎస్​ఐ డైరక్టర్ 

డా.రమేశ్​ కుమార్​తోపాటు మరికొందరిని అవినీతి నిరోధక శాఖ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. 

ఈ కేసులో బెయిల్ కోసం హైకోర్టులో పిటీషన్ వేశారు. ఇప్పటికే అచ్చెన్నాయుడుని పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించారని ..పూర్తి సమాచారం సేకరించారని పిటీషనర్ తరపు న్యాయవాది వాదించారు. అరెస్ట్ చేసి నెలరోజులుపైన గడిచిందని... రాజకీయ కక్షతోనే మాజీమంత్రిపై కేసు నమోదు చేశారని పిటీషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. కేసులో ఇంకా కొంతమంది కీలక నిందితులను అరెస్ట్ చేయాల్సి ఉందని దర్యాప్తు కొనసాగుతుండగా బెయిల్ ఇవ్వొద్దని ప్రభుత్వ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు పరిగణలోకి తీసుకుని బెయిల్ పిటీషన్​ను కొట్టేస్తూ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. ఈకేసులో నిందితులుగా ఉన్న మాజీ ఈఎస్ ఐ డైరక్టర్ డా.రమేశ్​కుమార్, పితాని సత్యనారయణ మాజీ పీఎస్ మురళీ , మరోనిందితుడు సుబ్బారావు బెయిల్ పిటీషన్లను సైతం హైకోర్టు కొట్టేసింది. 

ఇదీ చదవండి: లారీని ఢీకొట్టిన కారు... ఎస్‌బీఐ ఉద్యోగి సజీవదహనం

Last Updated : Jul 29, 2020, 2:48 PM IST

ABOUT THE AUTHOR

...view details