శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం రామచంద్రాపురంలో తోడబుట్టిన సోదరుడిని, సోదరిని దారుణంగా కత్తితో నరికి చంపిన గొర్లె రామకృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆస్తి పంపిణీ విషయంలో తలెత్తిన వివాదమే హత్యలకు కారణమని పోలీసులు తెలిపారు.
అసలేం జరిగింది..?

గొర్లె సన్యాసిరావు, రామకృష్ణలు తోడబుట్టిన సోదరులు. వారికి సోదరీలు కూడా ఉన్నారు. అక్కాచెల్లెలకు చెందిన ఆస్తి పంపిణీ విషయంలో అన్నదమ్ముల మధ్య వివాదం తలెత్తింది. పాలు సేకరిస్తున్న సన్యాసిరావుపై.. తమ్ముడు రామకృష్ణ కత్తితో దాడి చేశాడు. సన్యాసిరావు అక్కడికక్కడే మృతి చెందాడు. అక్కడే ఉన్న అక్క జయమ్మపై కత్తితో దాడి చేసి హత్య చేశాడు. అన్నా, చెల్లెలు సొంత సోదరుడి చేతిలో దారుణంగా హత్యకు గురికావడంతో గ్రామం ఉలిక్కిపడింది.
హత్యలపై జేఆర్ పురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్లు సీఐ చంద్రశేఖర్, ఎస్సై వాసునారాయణలు తెలిపారు.
ఇదీ చదవండి: భక్తులకు నిరాశ.. అరసవల్లి సూర్యనారాయణుడిని తాకని సూర్యకిరణాలు
TAGGED:
ranastalam murder case news