శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం గుల్ల సీతారాంపురం పున్నయ్య వైఫై ఫిష్ సెంటర్లో పని చేస్తున్న వ్యక్తి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. చేపల దుకాణంలో పని చేస్తున్నా ముంజేటి కృష్ణ(51) కాలు తిమ్మిరి ఎక్కి ఒక్కసారిగా లేగడంతో ప్రమాదవశాత్తు కత్తిపీటపై పడిపోయాడు. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మెడ భాగం కత్తిపీటకు తగలడంతో అధికంగా రక్త స్రావం జరిగి రక్తం మడుగులో కొట్టుమిట్టాడుతూ మరణించాడు. మృతుడు కృష్ణకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. సంతకవిటి ఎస్సై సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
చేపల దుకాణం వద్ద ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి - srikakulam latest update
శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలంలో ప్రమాదవశాత్తు కత్తిపీటపై పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మృతిచెందిన ముంజేటి కృష్ణ