ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నదీ స్నానానికి వెళ్తుండగా ప్రమాదం...వ్యక్తికి తీవ్ర గాయాలు - గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు

సూర్య గ్రహణం వీడిన అనంతరం నదీ స్నానానికి వెళ్తున్న ఓ వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ప్రమాదంలో అతని కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది.

గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు
గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు

By

Published : Jun 21, 2020, 11:53 PM IST

శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలం సంకిలి సమీపంలో ప్రమాదం జరిగింది. సంకిలి గ్రామానికి చెందిన గేదెల రవికుమార్....ఆదివారం సూర్య గ్రహణం వీడిన అనంతరం నాగావళి నదిలో స్నానం చేసేందుకు నడుచుకుంటూ వెళ్లాడు. సంకిలి బ్రిడ్జి సమీపంలో గుర్తుతెలియని వాహనం అతన్ని బలంగా ఢీకొంది. కిందపడిన అతని మీద నుంచి వాహనం వెళ్లింది. ప్రమాదంలో రవి కుమార్ కాళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న బాధితుడిని స్థానికులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించటంతో అంబులెన్స్​లో విశాఖపట్నం తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details