ACCIDENT: బైక్‌ను ఢీకొన్న గుర్తుతెలియని వాహనం.. ఇద్దరు మృతి - accident in ap latest
06:47 September 03
accident in srikakulam two died
శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం లట్టిగాం సమీపంలో జాతీయ రహదారిపై తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. పలాసవైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
పలాస - కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని చిన్నబడాంలో నివాసం ఉంటున్న మజ్జి లక్ష్మణ్ రావు(36) అక్కడికక్కడే మృతి చెందగా, గేదెల ప్రకాశ్ (33) టెక్కలిలోని జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. బ్రహ్మణతర్లాకు చెందిన కోతి శ్రీనివాసరావుకు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు. నందిగాం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: ఏకగ్రీవాలకు ప్రోత్సాహకాలేవీ?... నిధుల కోసం పంచాయతీల ఎదురుచూపులు