రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఏర్పడిందని గవర్నర్ జోక్యం చేసుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. వైకాపా ప్రభుత్వం కోర్టు తీర్పులను ధిక్కరిస్తూ..స్థానిక ఎన్నికలు జరగకుండా అడ్డుపడుతోందని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందా అనే భావన ప్రజల్లో వ్యక్తమవుతోందని ఆక్షేపించారు. పంచాయతీ రాజ్ చట్టానికి తూట్లు పొడుస్తూ..ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ సొంత నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. ఎన్నికల కమిషన్ రాజ్యాంగానికి లోబడి ఉన్న సంస్థ అని.. దానిని ఒక పార్టీకి ఆపాదించటం సరికాదన్నారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం సమీక్ష నిర్వహించాలన్నారు.
దేవాలయాలపై దాడులకు సీఎందే బాధ్యత