లంచం తీసుకుంటూ చిక్కిన నగర పంచాయతీ కమిషనర్ - లంచం
శ్రీకాకుళం జిల్లా రాజాం నగర పంచాయతీ కమిషనర్ వేగి సత్యనారాయణ 12 వేలు లంచం తీసుకుంటూ అనిశా అధికారులకు పట్టుబడ్డారు.
acb_rides_on_nagarapanchayathi_commissioner
శ్రీకాకుళం ఏసీబీ డీఎస్పీ కర్ణం రాజేంద్ర ఆధ్వర్యంలో అవినీతి నిరోధక శాఖాధికారులు దాడులు చేపట్టారు. స్థానిక రాజాం జీఎంఆర్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న జామి వెంకట్ సుమన్ ప్లాన్ అప్రూవల్ కోసం మీ సేవలో దరఖాస్తు చేశారు. నగర పంచాయతీ కమిషనర్‌ను కలిశారు. ఇరవై వేలు ఖర్చవుతుందని చెప్పారు. చివరకు 12000వేలకు బేరం కుదుర్చుకున్నారు. లంచం ఇవ్వడం ఇష్టం లేక సుమన్ అనిశా అధికారులను ఆశ్రయించారు. ఈ మేరకు లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు.