శ్రీకాకుళం జిల్లా రాజాం విద్యుత్ శాఖ ఏఈ లక్ష్మణరావు 80 వేల రూపాయలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు చిక్కారు. సారధికి చెందిన టంకాల దిలీప్ అనే వ్యక్తి.. వ్యవసాయ బోరు విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోగా.. ఏఈ లక్ష రూపాయలు డిమాండ్ చేశారు.
తరువాత 80వేలు ఇవ్వాలని కోరగా.. దిలీప్ అనిశా అధికారులను ఆశ్రయించాడు.ఈపీడీసీఎల్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఉండగా లక్ష్మణరావును.. డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలోని బృందం పట్టుకుంది.