పితాని సత్యనారాయణ మాజీ పీఎస్ మురళీమోహన్‌ను అనిశా అధికారులు సచివాలయంలో అదుపులోకి తీసుకున్నారు. అచ్చెన్నాయుడు తరువాత పితాని సత్యనారాయణ కార్మికశాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన హయాంలోనూ అక్రమాలు కొనసాగినట్లు ఆరోపణలు రావడంతో వీటిపై విచారించారు. అప్పటి ఈఎస్ఐ డైరెక్టర్, సిబ్బందితో కలిసి ఔషధాల కొనుగోలు చేశారని గుర్తించారు. అధిక ధరలకు కొనుగోలు చేయడంతో ప్రభుత్వానికి నష్టం వచ్చిందని అనిశా దర్యాప్తులో తేలింది. పితాని సత్యనారాయణ కుమారుడు వెంకట సురేశ్‌తో పాటు మురళి ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఇది హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలోనే మురళీని అధికారులు అరెస్ట్ చేశారు. న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. అనిశా న్యాయమూర్తి...మురళీమోహన్‌కు 14 రోజులు రిమాండ్ విధించారు.
ఈఎస్ఐ కేసు: పితాని మాజీ పీఎస్‌కు 14 రోజుల రిమాండ్
ఈఎస్ఐ ఔషధాల కొనుగోలు అవకతవకల కేసులో మాజీ మంత్రి పితాని పీఎస్ మురళీమోహన్‌ను అనిశా అధికారులు అరెస్ట్ చేశారు. మురళీమోహన్‌ను కొంతసేపు విచారించిన అనిశా అధికారులు... అనంతరం న్యాయమూర్తి వద్ద హాజరుపరిచారు. న్యాయమూర్తి..మురళీమోహన్‌కు 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం ఆయన్ని విజయవాడలోని జిల్లా జైలుకు తరలించారు.
అనిశా అధికారులు అదుపులో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మాజీ పీఎస్