ఈఎస్ఐ కుంభకోణంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఒక్క రూపాయి అవినీతి చేయలేదని తెలిసి కూడా అరెస్టు చేయడం ఘోరమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. కేవలం తెలంగాణాలో అమలైన విధానాన్ని అధ్యయనం చేసి రాష్ట్రంలో అమలు చేయండి అని లేఖ రాసినందుకు అరెస్ట్ చేశామని అధికారులే ఒప్పుకున్నారని విమర్శించారు.
ఈఎస్ఐ కుంభకోణంలో డీలర్ల నుంచి మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి డబ్బులు చేరినట్లు తమ దర్యాప్తులో తేలలేదని ఏసీబీ చెప్పినట్లు ఓ పత్రికలో ప్రచురితమైన కథనాన్ని నారా లోకేశ్ ట్వీట్ చేశారు.