డీఎడ్ యాజమాన్య కోటా విద్యార్ధులకు వెంటనే పరీక్షలు నిర్వహించాలని ఏబీవీపీ ప్రతినిధులు డిమాండ్ చేశారు. శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్ ఆధ్వర్యంలో నిరసన ధర్నా చేపట్టారు. 2018-20 విద్యా సంవత్సరానికి సంబంధించి డీఎడ్ స్పాట్‌తో పాటు మేనేజ్‌మెంట్ కోటాలో చేరిన విద్యార్ధులకు పరీక్షలు నిర్వహించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. తక్షణమే విద్యార్ధులకు పరీక్షలను నిర్వహించాలని డిమాండ్ చేశారు.
'డీఎడ్ యాజమాన్య కోటా విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలి' - శ్రీకాకుళం ముఖ్యంశాలు
డీఎడ్ యాజమాన్య కోటా విద్యార్థులకు వెంటనే పరీక్షలు నిర్వహించాలని శ్రీకాకుళంలో ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు.
ధర్నా చేస్తున్న ఏబీవీపీ ప్రతినిధులు