ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కిడ్నీ బాధితునికి అభయం సేవా సంఘం చేయూత - kidney disease latest news update

కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి అభయం సేవా సంఘం ప్రతినిధులు 25 వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. సామాజిక మాధ్యమాల ద్వారా విషయం తెలుసుకున్న సంస్థ సభ్యులు ఈ మేరకు వైద్య ఖర్చుల నిమిత్తం ఈ మొత్తాన్ని అందజేశారు.

Abhayam Youth Seva Sangamya
కిడ్నీ బాధితునికి అభయం సేవా సంఘం చేయూత

By

Published : Jun 7, 2020, 8:45 PM IST

శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం జడ్యాడ గ్రామానికి చెందిన కిడ్నీ బాధితుడు రంగోయి రామారావుకు.. టెక్కలికి చెందిన అభయం యువజన సేవా సంఘం రూ.25,000 ఆర్థిక సాయం అందించింది. కిడ్నీ సమస్య తోపాటు గుండె, ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకిన కారణంగా.. వైద్యం చేయించుకునేందుకు ఆయన ఇబ్బంది పడుతున్నారు.

దాతల సహాయం కోసం ఎదురు చేస్తున్నారన్న విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న అభయం యువజన సేవాసంఘం ప్రతినిధులు... వైద్య పరీక్షల కోసం ఈ మొత్తాన్ని బాధిత కుటుంబానికి అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details