ఆధార్ కార్డుల్లో వయస్సు మార్చుతున్న ముఠాను సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ అమిత్ బర్దార్ ఈ కేసు వివరాలను వెల్లడించారు. అనధికారికంగా ఆధార్ కార్డుల్లో వయసు మార్పు చేస్తున్న ఒడిశా ముఠాను పట్టుకున్నామని చెప్పారు. సరుబుజ్జలి పోలీస్‌స్టేషన్ పరిధిలో ముగ్గురు వ్యక్తులను గుర్తించామన్నారు.
ఆధార్లో మార్పులు చేస్తున్న ముఠా అరెస్ట్ - srikakulam district latest news
ఆధార్ కార్డుల వివరాల్లో మార్పులు చేస్తున్న ముఠాను సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. మొత్తం ఐదుగురిపై కేసు నమోదు చేసినట్టు ఎస్పీ అమిత్ బర్దార్ తెలిపారు. వీరు ఉపయోగిస్తున్న పరికరాలను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ప్రభుత్వ పథకాల్లో అర్హత కోసం మార్పులు చేస్తున్నట్టు గుర్తించామని వివరించారు.
ఆధార్లో మార్పులు చేస్తున్న ముఠాను పట్టుకున్న సీసీఎస్ పోలీసులు
ఒడిశా పర్లాఖిముడి ఆధార్ సెంటర్ నుంచి లాగిన్ అవుతున్నారని వివరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం ఆధార్ కార్డుల్లో వయస్సు, ఇంకా అవసరమైన మార్పులు చేస్తున్నట్టు చెప్పారు. వీరు ఉపయోగిస్తున్న పరికరాలను స్వాధీనం చేసుకున్నామని.. ఈ కేసులో ఐదుగురు సభ్యులను అరెస్టు చేశామని ఎస్పీ అమిత్ బర్దార్ తెలిపారు.