ప్రేమలో ఉన్నప్పుడు యువతితో దిగిన ఫొటోలను.. ఆమె కుటుంబ సభ్యులకు పంపాడు ప్రియుడు. ఆ ఫొటోలు కాస్త చనువుగా ఉన్నాయిగా. ఆ ఫొటోలు ఇంట్లో వాళ్లు చూడడంతో అవమానంగా భావించిన యువతి.. ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
దారుణం: యువతితో చనువుగా ఉన్న ఫొటోలను.. ఆమె కుటుంబ సభ్యులకు పంపాడు.. - ఆత్మహత్య
యువతితో చనువుగా ఉన్నప్పటి ఫొటోలను.. ఆమె కుటుంబ సభ్యులకు పంపాడు ప్రియుడు. దాంతో ఆ యువతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా రేగడి మండలంలో జరిగింది.
శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలానికి చెందిన ఓ యువతి.. హరీష్ అనే యువకుడు గతంలో ప్రేమించుకున్నారు. ప్రస్తుతం విడిపోయారు. దీంతో ఆమెపై కోపం పెంచుకున్న యువకుడు.. యువతితో చనువుగా ఉన్నప్పటి ఫొటోలను.. ఆమె కుటుంబ సభ్యులకు పంపాడు ప్రియుడు. దీంతో భయం, అవమానానికి గురై.. ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. శనివారం డీఎస్పీ బాలరాజు ఆధ్వర్యంలో యువతి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. త్వరలో నిందితుడిని అదుపులోకి తీసుకుంటామని డీఎస్పీ బాలరాజు తెలిపారు.
ఇదీ చదవండి:Crime news: విశాఖలో దారుణం.. బంగారం, డబ్బుకోసం వృద్ధురాలి హత్య