సైడ్‌స్టాండ్ తీయడం మరచి ద్విచక్ర వాహనం నడపడం ఓ విద్యార్థి ప్రాణాలను బలిగొంది. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం చిన్నమురపాకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తనూష్ బాబు అనే పదో తరగతి విద్యార్థి బలయ్యాడు.
సైడ్‌స్టాండ్ తీయడం మరచి బైక్ నడిపిన విద్యార్థి బలి - bike accident news in srikakulam district
ఒక్కగాని ఒక్క కొడుకును బాగా చదివించుకోవాలని కోరికతో ఉన్న ఊరును, వ్యవసాయాన్ని, బంధువులను వదిలి వేరే ప్రాంతానికి పంపి చదివిస్తున్నారు ఆ తల్లిదండ్రులు. ఇంతలోనే విధి కన్నెర్ర చేసింది. రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు కుమారుడి ప్రాణాలను బలితీసుకుంది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం చిన్నమురకలో జరిగింది.
సైడ్‌స్టాండ్ తీయడం మరచి బైక్ నడిపిన విద్యార్థి బలి
విజయనగరం జిల్లా నెల్లిమర్లలో నివసించే అతడు 3 రోజుల కిందటే స్వగ్రామంలోని బంధువుల ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలోనే సరదాగా ద్విచక్ర వాహనం నడిపిన అతడు... వాహనం సైడ్ స్టాండ్ తీయడం మరిచాడు. వేగంగా వెళుతుండగా ఒక్కసారిగా స్టాండ్ రోడ్డుకు తగిలి విద్యార్థి రహదారిపై బలంగా పడ్డాడు. తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మరణించాడు. కుమారుడి చదువుకోసమే ఉన్నఊరిని, బంధువులను వదిలి మరోచోట నివసిస్తున్న తల్లిదండ్రులకు ఈ ఘటన తీరని విషాదం మిగిల్చింది.
ఇవీ చదవండి