శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలంలోని ఆలయాల్లో వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు.. భగవంతుని సొమ్ము అపహరిస్తున్నారు. ఆదివారం అర్ధరాత్రి బాబా మందిరంలో చోరీ జరిగిన వార్త మరువక ముందే సోమవారం అర్ధరాత్రి చాపర గ్రామంలోని ముత్యాలమ్మ- పోచమ్మ ఆలయంలో దొంగలు పడ్డారు. అరకిలో వెండి, రెండున్నర తులాల బంగారం చోరీ జరిగినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు మంగళవారం ఉదయం క్లూస్ టీం తో వచ్చి పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఆలయాల్లో వరుస దొంగతనాలు.. ఆభరణాలు, నగదు చోరీ - పోలీస్
శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలంలోని ఆలయాల్లో జరుగుతున్న దొంగతనాలు స్థానికుల్లో కలవరం పెంచుతన్నాయి. ఆదివారం అర్ధరాత్రి బాబా మందిరంలో చోరీ జరిగింది. సోమవారం అర్ధరాత్రి చాపర గ్రామంలోని ముత్యాలమ్మ - పోచమ్మ ఆలయంలో దొంగలు పడి వెండి, బంగారు వస్తువులు అపహరించారు.
మెళియాపుట్టి మండలంలోని ఆలయాల్లో వరుస దొంగతనాలు