ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెళ్లి చేసుకుందామనుకున్నాడు... కానీ రెండు లక్షలు ఫైన్​ పడింది... - కొవిడ్ నిబంధనలను పాటించనందుకు ఫైన్

పెళ్లంటే ఆత్మీయల సమక్షంలో ఆనందంగా జరుపుకొనే ఓ వేడుక. ప్రస్తుతం పరిస్థితుల్లో ఇదీ కాస్త అసాధ్యమైన విషయమనే చెప్పాలి. అతి కొద్ది మందితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకునేలా అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. ఈ నిబంధనలను బేఖాతరు చేస్తూ.. ఏకంగా 200మంది సమక్షంలో వివాహం చేసుకోవాలనుకున్నాడు ఓ వ్యక్తి. మరి ఇంత చేస్తుంటే మన పోలీసులు ఊరుకుంటారా 2,00,000 పైన్ విధించారు. అసలేమైందంటే..

fine
పెళ్లికుమారుడికి ఫైన్

By

Published : May 27, 2021, 3:30 PM IST

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం సీది గ్రామానికి చెందిన రాంబాబు అనే వ్యక్తికి కొవిడ్ నిబంధనలను అనుసరించి 20 మందితో వివాహం నిర్వహించుకునేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు. అందుకు విరుద్ధంగా అతను ఏకంగా 200 మంది సమక్షంలో వివాహం చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. విషయంపై స్థానికులు ఫిర్యాదు చేయటంతో తహసీల్దార్ కాళీ ప్రసాద్, ఎస్ఐ అమీర్ ఆలీ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిబంధనలను ఉల్లంఘించినందుకు పెళ్లికొడుకు రాంబాబుకు 2,00,000 అపరాధ రుసుం విధించారు. భవిష్యత్తులో ఎవరూ ఇలా నిబంధనలు ఉల్లంఘించవద్దని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details