ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

108 సిబ్బంది మధ్య వివాదం... చికిత్స ఆలస్యమై మహిళ మృతి! - ఇచ్ఛాపురంలో 108 సిబ్బంది గొడవ వార్తలు

108 అంబులెన్స్ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఓ మహిళ ప్రాణాలు విడిచింది. బాధితురాలిని ఆసుపత్రికి తీసుకెళ్లకుండా 108 అంబులెన్స్​ల సిబ్బంది వాగ్వాదానికి దిగారు. తీరా గొడవ ముగిశాక ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది.

108 staff fight
108 staff fight

By

Published : Aug 5, 2020, 7:59 PM IST

Updated : Aug 5, 2020, 8:53 PM IST

మృతురాలి బంధువు ఆవేదన

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో దారుణం చోటుచేసుకుంది. 108 సిబ్బంది నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. మండలంలోని ముచ్చిందర గ్రామానికి చెందిన సాడీ తులసమ్మ(63) బుధవారం పాము కాటుకు గురైంది. బాధితురాలిని స్థానికులు వెంటనే ఇచ్ఛాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు. మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం తరలించాలని వైద్యులు సూచించారు. ఇచ్ఛాపురం ప్రభుత్వాసుపత్రిలోని అంబులెన్స్ కొవిడ్ రోగులను తరలించేందుకు వినియోగిస్తున్నామని చెప్పటంతో బాధితురాలని బంధువులు 108కి ఫోన్ చేశారు. దాదాపు 2 గంటల తరువాత కవిటి నుంచి ఇచ్ఛాపురానికి అంబులెన్స్ వచ్చింది.

సిబ్బంది వాగ్వాదం

కవటి నుంచి ఇచ్ఛాపురం ఆసుపత్రికి వచ్చిన 108 అంబులెన్స్​లోని సిబ్బంది... ఇచ్ఛాపురం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్న 108 సిబ్బంది మధ్య వాగ్వాదం జరిగింది. దీనివల్ల మరో గంట సమయం వృథా అయింది. చివరికి బాధితురాలని 108 వాహనంలో శ్రీకాకుళం తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు విడిచింది. 108 సిబ్బంది నిర్లక్యం వల్లే ఒక నిండు ప్రాణం పోయిందని మృతురాలని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదని ఇచ్ఛాపురం ప్రభుత్వ ఆసుపత్రి ముందు నిరసనకు దిగారు. మరోవైపు ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ నివాస్ మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఇచ్ఛాపురం తహసీల్దార్​ను ఆదేశించారు.

ఇదీ చదవండి

మహిళా ఉద్యోగులపై వేధింపులు..వ్యవసాయ శాఖ జేడీఏ హబీబ్ బాషా అరెస్ట్

Last Updated : Aug 5, 2020, 8:53 PM IST

ABOUT THE AUTHOR

...view details