శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలంలో కోళ్ల దొంగ సీసీ కెమెరాకు చిక్కాడు. ఆదివారం సంతకు సమీపంలో ఉండే ఓ హోటల్లో ఈ దొంగతనం జరిగింది. విలువైన జాతి కోళ్లు ఎత్తుకెళ్లిపోయినట్టు హోటల్ నిర్వాహకులు చెబుతున్నారు. జాతీయ రహదారి పక్కనే ఉండే ఈ హోటల్లో నిత్యం చాలా మంది డ్రైవర్లు భోజనాలు చేస్తుంటారు. అలా వచ్చిన వాళ్లో లేకుంటే స్థానికులే ఈ దొంగతనానికి పాల్పడ్డారనే అనుమానం వ్యక్తమవుతోంది. అయితే దొంగ ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తి కాకపోవచ్చని సీసీ కెమెరా చూసిన పోలీసులు, స్థానికులు అభిప్రాయపడుతున్నారు. దొంగతనం చుట్టుపక్కల గ్రామాల్లో కలకలం రేపింది.
దొంగకోళ్లు పట్టుకునే మొహాన్ని ఎప్పుడైనా చూశారా...? - chicken stealing in kanchili news
దొంగకోళ్లు పట్టుకునే మొహం చూడు... అని తిట్టడం మనం వింటూనే ఉంటాం. కానీ శ్రీకాకుళం జిల్లా కంచిలిలో అలాంటి వ్యక్తి సీసీ కెమెరాకు చిక్కాడు. రోడ్డుపక్కనే ఉన్న ఓ హోటల్లో దొంగతనం చేసి నిఘా కంటికి దొరికిపోయాడు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది.
దొంగకోళ్లు పట్టుకునే మొహాన్ని ఎప్పుడైనా చూశారా...?