పోలీసుల తీరును నిరసిస్తూ.. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో పృథ్వీరాజ్ అనే వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తుంది. భార్యాభర్తల ఫిర్యాదు విషయంలో తనకు పోలీసులు న్యాయం చేయట్లేదని మనస్థాపానికి గురైన పృథ్వీరాజ్... శ్రీకాకుళం దిశ పోలీసు స్టేషన్ ఎదుట పెట్రోలు తాగేశాడు. వెంటనే స్పందించిన పోలీసులు.. అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం పృథ్వీరాజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.
శ్రీకాకుళంలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. వీడియో హల్‌చల్.. - sucide video halchal at Srikakulam
పోలీసుల తీరుతో మనస్థాపం చెందిన పృథ్వీరాజ్ అనే వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. శ్రీకాకుళం దిశ పోలీసు స్టేషన్ ఎదుట పెట్రోలు తాగిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేసింది.
శ్రీకాకుళంలో యువకుడి ఆత్మహత్యాయత్నం