శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలోని ఓ తీరప్రాంత గ్రామంలో మైనర్పై ఓ వివాహితుడు పలుమార్లు అత్యాచారం చేసి మోసగించిన ఘటన వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన లక్ష్మణరావు.. ప్రేమించానంటూ అదే గ్రామానికి చెందిన ఓ బాలిక వెంట పడ్డాడు. బాలిక సోదరుడికి ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఇంటికి రాకపోకలు సాగించి.. వలపు వలకు తెరలేపాడు. ఆమెకు 15 ఏళ్ల వయసున్నప్పటి నుంచే బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. గర్భవతిని చేసి పలుమార్లు బలవంతంగా గర్భస్రావం కూడా చేయించాడు. నిందితుని మోసాన్ని కుటుంబ సభ్యులు ఆలస్యంగా గుర్తించారు.
గ్రామ పెద్దల వద్ద పంచాయితీ
బాలికను మోసగించిన ఘటనపై.. కుటుంబ సభ్యులు గ్రామ పెద్దల సమక్షంలో పలుమార్లు పంచాయతీ నిర్వహించారు. ఎటూ తేలకపోవడం వల్ల చివరకు పోలీసులను ఆశ్రయించారు. అక్కడా తమకు న్యాయం జరగలేదని బాధిత కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. బాలిక శీలానికి వెలకట్టి రూ.18 లక్షలు, ఓ ఇంటి స్థలం.. బాధితురాలికి ఇచ్చేలా ఒప్పంద పత్రాలపై సంతకాలు పెట్టించినట్లు చెబుతున్నారు.
ఎస్పీ ఆదేశాలతోకదలిక
బాధిత కుటుంబీకులు తమకు న్యాయం చేయాలని ఈనెల 4వ తేదీన జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. కేసు నమోదు చేయాలని ఆదేశించినా.. ఆయన బదిలీ కావడం విషయం మళ్లీ మొదటికొచ్చింది. ఈ క్రమంలో ఈనెల 27న హ్యూమన్ రైట్స్ ఫోరమ్ ఆఫ్ ఇండియా ప్రతినిధులతో కలసి బాధితులు మళ్లీ పోలీసులను ఆశ్రయించారు.
శనివారం అర్ధరాత్రి వరకూ తమను పోలీస్ స్టేషన్లో ఉంచి.. చివరకు కొత్త ఎస్పీ ఆదేశాలతో కేసు నమోదు చేశారని బాధితులు వాపోయారు. నౌపడా ఎస్సై, టెక్కలి సీఐ తమకు న్యాయం చేయకుండా వేధించారని ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
బాలిక తండ్రి ఆవేదన