ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇష్టమైన కూర వండలేదని భార్యతో ఘర్షణ.. భర్త ఆత్మహత్య - man sucide for small matter in srikakulam news

భార్యాభర్తల మధ్య ఓ చిన్న తగాదాతో భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. తనకు ఇష్టమైన కూర వండలేదని ఆ భర్త భార్యతో గొడవ పడి నేలబావిలో పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇష్టమైన కూర వండలేదని భార్యతో ఘర్షణ.. భర్త ఆత్మహత్య
ఇష్టమైన కూర వండలేదని భార్యతో ఘర్షణ.. భర్త ఆత్మహత్య

By

Published : Jul 16, 2020, 4:42 PM IST

భార్య తనకు ఇష్టమైన కూర వండలేదని భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గలో జరిగింది. పట్టణంలో అన్నపూర్ణ ఆశ్రమానికి చెందిన బెల్లాల ఆంజనేయులు తనకు ఇష్టమైన కూర వండమని భార్యకు చెప్పాడు. అయితే లాక్​డౌన్​ కారణంగా దుకాణాలు తెరవనందున వండలేనని భార్య నిరాకరించింది. ఈ క్రమంలో భార్యతో గొడవపడ్డాడు. అనంతరం క్షణికావేశంలో సమీపంలోని కూరగాయల పొలంలోని నేలబావిలో పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు డైలీ కలెక్షన్ ఏజెంట్​గా పని చేస్తున్నట్టు బంధువులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details