శ్రీకాకుళం జిల్లా లక్ష్మీ నరసన్నపేటలో విధులు నిర్వహిస్తూ సచివాలయం జూనియర్ లైన్మెన్ మృతి చెందాడు. బొత్తాడసింగి గ్రామానికి చెందిన జూనియర్ లైన్మెన్ సాహుకారి వెంకటరమణ లక్ష్మీనర్సన్నపేట గ్రామంలో విద్యుత్ స్తంభం పై విధులు నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదఘాతానికి గురై మృతి చెందాడు. విద్యుత్ సరఫరా నిలిపివేసి విధులు నిర్వహిస్తున్నప్పటికీ స్థానికంగా ఉన్న నివాసాల్లోని ఇన్వెర్టర్ కారణంగా విద్యుత్ సరఫరా జరిగి వెంకటరమణ స్తంభంపైన మృతి చెందాడు. సమీప గృహాల్లోని ఇన్వెర్టర్ నుంచి కరెంట్ రావడం వల్ల విద్యుత్ ప్రమాదం జరిగిందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. విద్యుత్ శాఖ సిబ్బంది నిర్లక్ష్యం వలన తన కుమారుడు కోల్పోయామని వెంకటరమణ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరసింహమూర్తి తెలిపారు. మృతునికి భార్య రాణి, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
lineman died: ఇన్వెర్టర్ల నుంచి విద్యుత్ ప్రసరించి లైన్మెన్ మృతి - Linemen died in Lakshmi Narasannapeta
విధులు నిర్వర్తిస్తూ ఓ జూనియర్ లైన్మెన్ మృతి చెందాడు. శ్రీకాకుళం జిల్లా లక్ష్మీ నరసన్నపేట మండలంలో ఈ ప్రమాదం జరిగింది.
lineman died