ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకాపా నాయకుడిపై పోలీసులకు మహిళా వీఆర్వో ఫిర్యాదు - kondagudem village news

శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం కొండగూడెంకు చెందిన వైకాపా నాయకుడిపై అదే గ్రామ వీఆర్వోగా పనిచేస్తున్న మహిళ.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. తహసీల్దార్ కార్యాలయంలోనే తనపై దాడికి యత్నించాడని ఆరోపించింది.

A female VRO has lodged a complaint with the police against ycp leader
A female VRO has lodged a complaint with the police against ycp leader

By

Published : Oct 2, 2020, 11:14 PM IST

శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం కొండగూడెం మాజీ సర్పంచ్, వైకాపా నాయకులు కె.సూర్యారావు నుంచి తనకు ప్రాణ హాని ఉందని ఆ గ్రామ వీఆర్వో కుప్పిలి సుశీల సంతకవిటి పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. గురువారం సంతకవిటి తహసీల్దార్ కార్యాలయంలో తనపై అతను దాడి చేసేందుకు యత్నించాడని బాధితురాలు ఆరోపించారు.

గతంలోనూ తనను కులం పేరుతో దూషించారని ఆమె చెప్పారు. దీనిపై సంతకవిటి పోలీస్​స్టేషన్​లో రాజాం రూరల్ సీఐ నవీన్​కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలికి న్యాయం జరగాలంటూ వీఆర్వోలు తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details