ఓ బాలుడు గొంతులో మూత ఇరుక్కుపోవడం వల్ల ఊపిరి ఆడక మృతి చెందాడు. మరో వారం రోజుల్లో మొదటి పుట్టిన రోజు జరుపుకోవాల్సిన ఆ చిన్నారికి అప్పుడే నిండు నూరేళ్లు నిండాయి. ఈ విషాదకర ఘటన శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మున్సిపాలిటీ రత్తకన్న ఒడియా వీధిలో జరిగింది. గీతా దలై అనే మహిళ ప్రసవం కోసం రత్తకన్న ఒడియా వీధిలో నివాసముంటున్న తల్లిదండ్రుల వద్దకు వచ్చి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. బాబుకు లియన్స్ అనే పేరు పెట్టి అల్లారుముద్దుగా చూసుకుంటుంది. ఏడాది కావస్తుండటం వల్ల బిలాయిలో ఉన్న భర్త కుమార్ వద్దకు వెళ్లాలనుకుంది. ఈ నెల 10న అక్కడే బాబుకు తొలి పుట్టినరోజు వేడుకలు నిర్వహించాలని ఎన్నో కలలు కన్నారు. అయితే ఆమె అత్తారింటికి పయనం అవుతున్న తరుణంలో విషాదం చోటు చేసుకుంది. ఆడుకుంటున్న అబ్బాయి గొంతులో ప్రమాదవశాత్తు ఓ మూత ఇరుక్కుపోయింది. దీంతో ఊపిరి ఆడక ఆ చిన్నారి మృతి చెందాడు. దీంతో కన్నవారు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ పాప మరణం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
విషాదం.. గొంతులో మూత ఇరుక్కుపోయి బాబు మృతి - Child dies due to cap stuck in throat at srikakulam
ఆ చిన్నారి తొలి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించాలని కన్నవారు ఎన్నో కలలు కన్నారు. అంతలోనే ఆ ఇంట విషాదం నెలకొంది. అప్పటివరకు ఆడుతూ ఉన్న ఆ బాలుడు గొంతులో మూత ఇరుక్కుపోవడం వల్ల ఊపిరి ఆడక విలవిలలాడాడు. కళ్ల ముందే బిడ్డ మరణాన్ని చూసిన తల్లి తల్లడిల్లిపోయింది. ఈ విషాద ఘటన శ్రీకాకుళం జిల్లా రత్తకన్న ఒడియా వీధిలో జరిగింది.
గొంతులో మూత ఇరుక్కుపోయి చిన్నారి మృతి