శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం పెద్ద సవలాపురం వద్ద వంశధార నదిలో ఓ మహిళ చిక్కుకుంది. నది గర్భంలో రత్నాలమ్మ అనే మహిళ ఆవును మోత కోసం మధ్యాహ్నం తీసుకువెళ్లింది. ఒక్కసారిగా వంశధార నది ఉధృతి పెరగడంతో దగ్గర ఉన్న జీడి చెట్టు పట్టుకుని ఉండి పోయింది. ఆవు ఇంటికి చేరిపోయిన... రత్నాలమ్మ ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన కుంటుంబ సభ్యులు నదీ ప్రాతంలో వెతికారు. సుమారు తొమ్మిది గంటలు నదిలో ఉన్న రత్నాలమ్మను గ్రామస్తులు కాపాడి బయటకు తీశారు.
నది ప్రవహ ఉద్ధృతిలో 9 గంటలు నరకయాతన - vamshadara
వరద ప్రవాహంలో నది గర్భంలో చిక్కుకొని ఓమహిళ తొమ్మిది గంటల పాటు మృత్యువుతో పోరాడి బయటపడింది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలిలో చోటుచేసుకుంది.

9 గంటలు నరకయాతన
నది ప్రవహ ఉద్ధృతిలో 9 గంటలు నరకయాతన
Last Updated : Aug 8, 2019, 12:39 PM IST