శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం సమీపంలో సరైన పత్రాలు లేకుండా ఒడిశాకు వెళ్తున్న మూడు లారీలను అధికారులు పట్టుకున్నారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, మార్కెటింగ్ శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. వీటి విలువ 80 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఉల్లిపాయ ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో బ్లాక్ మార్కెట్లో తరలిస్తున్న ఉల్లిపాయలపై అధికారులు నిఘా పెట్టారు. ఆంధ్ర-ఒడిశా సరిహద్దులోని ఇచ్చాపురం లోద్దపుట్టి జంక్షన్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించారు. కర్నూల్ నుంచి ఒడిశాకు వెళ్తున్న రెండు లారీలను... మహారాష్ట్ర నుంచి ఒడిశాకు వెళ్తున్న ఒక లారీని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు.
ఇచ్ఛాపురం జంక్షన్ వద్ద రూ.80 లక్షల విలువైన ఉల్లి పట్టివేత - onions latest updates in ap
సరైన పత్రాలు లేకుండా కర్నూలు, మహరాష్ట్ర నుంచి ఒడిశాకు ఉల్లిపాయలతో వెళ్తున్న మూడు లారీలను విజిలెన్స్ అధికారులు ఇచ్ఛాపురం వద్ద పట్టుకున్నారు.
![ఇచ్ఛాపురం జంక్షన్ వద్ద రూ.80 లక్షల విలువైన ఉల్లి పట్టివేత ఇచ్ఛాపురం జంక్షన్ వద్ద 80 లక్షల విలువ గల ఉల్లి పట్టివేత](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5293314-222-5293314-1575648455106.jpg)
ఇచ్ఛాపురం జంక్షన్ వద్ద 80 లక్షల విలువ గల ఉల్లి పట్టివేత
ఇచ్ఛాపురం జంక్షన్ వద్ద 80 లక్షల విలువ గల ఉల్లి పట్టివేత
ఇదీ చదవండి :