అంత కష్టం ఏమెుచ్చిందమ్మా నీకు.. శ్రీకాకుళం జిల్లా పెద్దపేట సమీపంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయం వెనక భాగంలో ఉన్న బావిలో దూకి ఓ వృద్ధురాలు ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని తాళ్ల సాయంతో బయటకు తీశారు. మృతురాలు గత రెండు రోజులుగా వీధుల్లో తిరుగుతూ బావి ఎక్కడుందో అడిగిందని
స్థానికులు చెబుతున్నారు. మతిస్థిమితం లేక అడుగుతుందేమోనని పట్టించుకోలేదని.. ఇలా ఆత్మహత్య చేసుకుంటుందని ఊహించలేదని గ్రామస్థులంటున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతురాలు శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం జాడుపూడి గ్రామానికి చెందిన హేమల రత్నాలమ్మగా గుర్తించారు. ఘటన సమాచారం మృతురాలు కుమార్తె నాగమణికి అందించామని.. ఆరోగ్యం సరిగ్గా లేక మనస్తాపంతో ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చునని చెప్పారని నరసన్నపేట ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు.