శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం మాకివలస గ్రామంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. 1959లో ఏర్పాటైన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు... 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అక్కడ చదువుకున్న విద్యార్థులు, బోధించిన ఉపాధ్యాయులతో సందడి నెలకొంది. దాదాపు 100 మంది ఉపాధ్యాయులను 3 వేల మంది విద్యార్థులు సన్మానించారు. ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్నాయుడు, మాజీఎమ్మెల్యేలు రమణమూర్తి, లక్ష్మణరావు, విద్యాశాఖ అధికారులు హాజరయ్యారు.
మాకివలసలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం - latest news for makivalasa alumini function
నరసన్నపేట మండలం మాకివలస గ్రామంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి ధర్మాన కృష్ణదాస్ పాల్గొన్నారు.
60 ఏళ్ల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం