శ్రీకాకుళంలో రోడ్డు ప్రమాదం... 50 యాత్రికులు సురక్షితం శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పైడి భీమవరం సమీపంలోని వరిసాం కూడలి వద్ద యాత్రికులకు పయనిస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. జాతీయ రహదారిపై వెళ్తోన్న యాత్రికుల బస్సు ముందు వెళ్తున్న ఓ పరిశ్రమ బస్సును ఢీ కొని రహదారి పక్కనే ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనతో బస్సులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. పూరీ నుంచి రామేశ్వరం వెళ్తుండగా ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. ఈ ప్రమాదంలో 50 మంది యాత్రికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. బాధితులు ఉత్తరాఖండ్‌కు చెందిన అల్వాని వాసులుగా గుర్తించారు. ఉత్తరాఖండ్‌లోని 14 జిల్లాలకు చెందిన 100 మంది యాత్రికులు రెండు టూరిస్టు బస్సుల్లో గతేడాది డిసెంబర్ 26న బయలుదేరారు. ఈ ప్రమాదంలో దాదాపు రూ.40 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లింది.
ఇదీ చూడండి: