పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలంలోని శివారు గ్రామంగా ఉన్న ఒక మైనర్ పంచాయతీలో సర్పంచి పదవి జనరల్ మహిళకు కేటాయించారు. ఇక్కడ తెదేపా, జనసేన కలిసి పోరుకు దిగాయి. వైకాపా అభ్యర్థి మరొకరున్నారు. వీరు కాకుండా మరో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో ఒకరు తనకు పదవి కేటాయిస్తే రూ. 30 లక్షలు ఇస్తానని ముందుకురాగా మరొకరు రూ. 40 లక్షలు ఇస్తానని... ఆ మొత్తంతో గ్రామంలో కల్యాణ మండపం నిర్మించుకోవచ్చని ఆఫర్ ఇచ్చారు. తెదేపా, జనసేన జట్టులో ఒకరికి సర్పంచి వస్తే మరొకరు ఉపసర్పంచిగా ఉండాలని ఒప్పందం చేసుకున్నారు. రూ. 30 లక్షలు ఇస్తానన్న స్వతంత్ర అభ్యర్థి తనకు అయిదుగురు వార్డుమెంబర్ల మద్దతు కోరారు. రూ.40 లక్షలిస్తానన్న అభ్యర్థి మాత్రం సర్పంచి పదవి మాత్రమే అడగడం గమనార్హం. దీనిపైనే ఇపుడు చుట్టుపక్కల గ్రామాల్లో చర్చ నడుస్తోంది.
సర్పంచి పదవికి బేరం.... - పశ్చిమ గోదావరి జిల్లాలో పంచాయతీ ఎన్నికల వార్తలు
ఓ మైనర్ గ్రామ పంచాయతీలో సర్పంచి పదవికి తెదేపా, జనసేన కలిసి పోరుకు దిగాయి. వైకాపా అభ్యర్థి మరొకరున్నారు. వీరు కాకుండా మరో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో ఒకరు తనకు పదవి కేటాయిస్తే రూ. 30 లక్షలు ఇస్తానని ముందుకురాగా మరొకరు రూ. 40 లక్షలు ఇస్తానని ఆఫర్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలంలో చర్చనీయమైంది.
సర్పంచి పదవికి బేరం....