Four killed in tractor overturn: ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా నలుగురు మృతి చెందిన ఘటన ఆంధ్రా-ఒడిశా సరిహద్దల్లో చోటు చేసుకుంది. ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో ట్రాక్టర్ బోల్తాపడి నలుగురు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఆరుగురికి తీవ్ర గాయాలు అయినట్లు వైద్యులు పేర్కొన్నారు. మరో ఇద్దరf పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. బాధితులు చిత్రకొండ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడమే ప్రమాదానికి కారణం:స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం... ఏవోబీలోని మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ బ్లాక్‌లోని కటాఫ్ ఏరియాలోని బడపదర్ పంచాయతీలోని సుమారు 15 మంది గాజులుమామిడి పంచాయతీ తంట్లగుడా గ్రామంలోని ఒకరి అంత్యక్రియలకు వెళ్లి తిరిగి వస్తున్నారు. ఖరిమల్ గ్రామ సమీపం వద్ద ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్సపొందుతూ ముగ్గురు మృతి చెందారు. మిగతా క్షతగాత్రులను చిత్రకొండ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వీరిని అధికారులు మల్కన్‌గిరి జిల్లా ఆసుపత్రికి తరలించారు. మల్కన్‌గిరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. మృతుల్లో ఐదేళ్ల చిన్నారి ఉంది. డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించి ట్రాక్టర్‌ను రహదారి పక్కనే ఆపి బయటకు వెళ్లారని, ఈ క్రమంలో ట్రాక్టర్ బోల్తాపడి 30 అడుగులు లోయలో పడిందని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. ఘటనపై స్థానిక పోలీసులు స్పందించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపడతామని వెల్లడించారు.