శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గంలో రెండు వేరు వేరు ప్రాంతాల్లో విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి చెందారు. నరసన్నపేట పట్టణంలోని ఉణ్ణవారి వీధిలో విద్యుదాఘాతానికి గురై అలిగి హేమంత్ కుమార్ అనే ఇంటర్ విద్యార్థి మృతి చెందారు. వినాయక నవరాత్రి ఉత్సవాలు ముగిసిన నేపథ్యంలో.. విద్యుత్ దీపాలు తొలగిస్తుండగా.. ప్రమాదం జరిగింది. కరెంటు ఎర్త్ అవుతోందని వెదురు కర్రల పక్కన విద్యుత్ తీగలను ఉంచామని మెకానిక్ తెలిపారు. ఇది తెలియక హేమంత్ కుమార్ ఆ తీగలను తాకి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు.
సారవకోటలో...