శ్రీకాకుళం జిల్లాలో 4 మండలాల్లోని 27 గ్రామాలను కంటైన్మెంట్ ప్రాంతాలుగా గుర్తించినట్లు పాలకొండ ఆర్డీవో తెలిపారు. కరోనా నేపథ్యంలో పలు గ్రామాల్లో తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పాతపట్నం, కొత్తూరు, హిరమండలం, సారవకోటలోని 27 గ్రామాలను నేటి నుంచి కంటైన్మెంట్ ప్రాంతాలుగా గుర్తించామని వెల్లడించారు. ప్రజలెవరూ బయటకు రావొద్దని.. నిత్యావసరాలు, తాగునీరు ఇంటింటికీ సరఫరా చేస్తామని తెలిపారు.
కరోనా ఎఫెక్ట్: కంటైన్మెంట్ ప్రాంతాలుగా.. 27 గ్రామాలు - శ్రీకాకుళం జిల్లాలో కరోనా లాక్ డౌన్ తాజా వార్తలు
శ్రీకాకుళం జిల్లాలో నేటి నుంచి 27 గ్రామాలను కంటైన్మెంట్ ప్రాంతాలుగా గుర్తించామని అధికారులు తెలిపారు. ప్రజలు బయటకు రావొద్దని, నిత్యావసరాలు ఇంటివద్దకే పంపిణీ చేస్తామని చెప్పారు.
అధికారులతో సమావేశమైన పాలకొండ ఆర్డీఓ