సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ మోసం చేశాడని యువతి ఆత్మహత్య - gurudaspuram latest crime news
గురుదాస్పురంలో 25 ఏళ్ల యువతి బావిలో పడి ఆత్మహత్య చేసుకుంది. సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ తులసీదాస్ తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఓ లేఖలో పేర్కొంది.
![సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ మోసం చేశాడని యువతి ఆత్మహత్య](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4743198-437-4743198-1570991465211.jpg)
ప్రేమించి మోసం చేశాడని బావిలో దూకిన యువతి
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం గురుదాస్పురంలో 25 ఏళ్ల యువతి బావిలో పడి ఆత్మహత్యకు పాల్పడింది. మందస మండలం రట్టి గ్రామానికి చెందిన సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ తులసీదాస్ తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఓ లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. దీనిపై యువతి కుటుంబసభ్యులు కాశిబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Last Updated : Oct 28, 2019, 8:30 AM IST