చెన్నైలో చిక్కుకున్న 22 మంది మత్స్యకారులు నాలుగు రోజులు ప్రయాణించి శ్రీకాకుళం జిల్లా రామయ్యపట్నంకు చేరుకున్నారు. వీరంతా 1.80 లక్షల రూపాయలతో ఒక పాత పడవను కొనుగోలు చేసి ప్రాణాలకు తెగించి, ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణించి రామయ్యపట్నానికి వచ్చారు. కేవలం అటుకులనే ఆహారంగా తీసుకుంటూ బిక్కుబిక్కుమంటూ స్వగ్రామాలకు చేరుకున్నారు.
అటుకులే ఆహారం... నాలుగు రోజులు పడవలో ప్రయాణం - శ్రీకాకుళం జిల్లా వార్తలు
లాక్డౌన్తో వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కూలీలు తమ స్వస్థలాలకు చేరుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు కాలినడకన పయనాన్ని ప్రారంభిస్తుంటే, మరికొందరు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. చెన్నైలో చిక్కుకున్న 22 మంది మత్స్యకారులు ప్రమాదకరంగా నాలుగు రోజులపాటు పడవలో ప్రయాణిస్తూ స్వగ్రామాలకు చేరుకున్నారు.
![అటుకులే ఆహారం... నాలుగు రోజులు పడవలో ప్రయాణం 22 Fishermen coming to theirs native places from chennai](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6986193-414-6986193-1588156066817.jpg)
స్వగ్రామానికి చేరుకున్న మత్స్యకారులు