శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలానికి చెందిన గ్రామ సహాయకుడు(వీఆర్ఏ) దేవాది లక్ష్మణరావు నిజాయతీని చాటుకున్నారు. కొత్తపేట రహదారిపై రూ.2 లక్షల నగదు, విలువైన ధ్రువపత్రాలతో దొరికిన బ్యాగును సంబంధిత వ్యక్తికి అందజేసి అందరి ప్రశంసలు అందుకున్నారు. రహదారిపై వెళ్తోన్న లక్ష్మణరావు పక్కన పడి ఉన్న ఓ బ్యాగులో చరవాణి మోగుతుండడాన్ని గమనించారు. దగ్గరకు వెళ్లి చూడగా బ్యాగులో చరవాణి, రూ.2 లక్షల నగదు, పలు ధ్రువపత్రాలు కనిపించాయి. వెంటనే దాన్ని కోటబొమ్మాళి తహసీల్దార్ రమేశ్‌బాబుకు అప్పగించారు. అనంతరం ఆ బ్యాగు పోలాకి మండలం రేగుపాడుకు చెందిన ఉపాధ్యాయుడు బీహెచ్ వెంకటరమణదిగా గుర్తించి... ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా వీఆర్ఏ లక్ష్మణరావును అధికారులు అభినందించారు.
చిరుద్యోగి నిజాయతీ.. దొరికిన రూ.2 లక్షలు అప్పగింత - చిరుద్యోగి నిజాయతీ:రోడ్డుపై 2 లక్షలు దొరికినా..రూపాయి ముట్టలేదు !
రూ.2 లక్షల విలువైన నగదు బ్యాగు రోడ్డు పక్కన దొరికినా... సంబంధిత వ్యక్తికి డబ్బును అందించి నిజాయతీని చాటుకున్నారో చిరుద్యోగి. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలానికి చెందిన గ్రామ సహాయకుడు(వీఆర్ఏ) దేవాది లక్ష్మణరావు తనకు దొరికిన నగద సంచిని తహసీల్దార్ రమేశ్ బాబు ద్వారా సంబంధిత వ్యక్తికి అందించారు.
చిరుద్యోగి నిజాయతీ