ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాజాంలో కుక్కలు స్వైర విహారం... 17 మందికి తీవ్ర గాయాలు - dogs attack news in srikakulam district

శ్రీకాకుళం జిల్లా రాజాంలో కుక్కలు స్వైర విహారం చేశాయి. కుక్కల దాడిలో 17 మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమించగా జిల్లా కేంద్రానికి తరలించారు.

dogs attack
కుక్కలు స్వైర విహారం

By

Published : May 17, 2021, 9:03 PM IST

శ్రీకాకుళం జిల్లా రాజాంలో కుక్కలు స్వైర విహారం చేశాయి. పట్టణంలోని డోలపేట జంక్షన్ పరిధిలో వాహనదారులతోపాటు పాదచారులపై సైతం కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో 17 మంది గాయాలయ్యాయి. వీరిని చికిత్స కోసం పొగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమించగా..మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం తరలించారు.

డోలపేట జంక్షన్ సమీపంలో కుక్కలు ఎక్కువగా విహారం చేయడానికి చికెన్ షాప్​లు ఎక్కువ ఉండడమే కారణమని పలువురు ఆరోపిస్తున్నారు. గతంలోను వాహనదారులు, పాదచారులపై కుక్కలు దాడి చేసిన సందర్భాలు చాలా ఉన్నాయన్నారు.

ఇదీ చదవండి

పాలకొండలో పక్కాగా కర్ఫ్యూ .. 12 దాటితే రాకపోకలు బంద్

ABOUT THE AUTHOR

...view details