గతేడాది అక్టోబర్ నెలలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తమకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని 104 ఉద్యోగులు శ్రీకాకుళం జీజీహెచ్ ప్రధాన గేటు ఎదుట చేసిన ధర్నాలో డిమాండ్ చేశారు. భద్రతతో కూడిన ఉద్యోగంతో పాటు వేతనాలు చెల్లిస్తామని సీఎం భరోసా ఇచ్చారని తెలిపారు. సీఎం హామీ నెరవేర్చక పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా 1050 మంది ఉద్యోగులు రోడ్డున పడ్డామన్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఉద్యోగులను విధులకు హాజరు కాకుండా అడ్డుకున్నారని వాపోతున్నారు.
సీఎం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని 104 ఉద్యోగుల ధర్నా
ముఖ్యమంత్రి జగన్ తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ శ్రీకాకుళం జీజీహెచ్ ప్రధాన గేటు ఎదుట 104 ఉద్యోగులు ధర్నా చేశారు.
సీఎం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని 104 ఉద్యోగుల ధర్నా