The boat capsized: వేట ముగించుకుని మత్స్యకారులు ఒడ్డుకు చేరుకునే సమయంలో రాకాసి అలకు బోటు బోల్తాపడిన ఘటన శ్రీకాకుళం జిల్లా మంచినీళ్లపేట తీరంలో జరిగింది. పది మంది మత్స్యకారులతో బుధవారం సాయంత్రం ఒక బోటులో సముద్రంలో వేటకు వెళ్లారు. ఒడ్డుకు చేరుకునే సమయంలో బోటు బోల్తా పడడంతో ప్రమాదం జరిగిందని మత్స్యకారులు తెలిపారు.
శ్రీకాకుళంలో పడవ బోల్తా.. 10మంది మత్స్యకారులు సురక్షితం - Srikakulam boat capsized
The boat capsized: అర్ధరాత్రి దాదాపు 12 గంటల సమయం.. చిమ్మ చీకటి.. మరికొద్ది సేపట్లో ఒడ్డుకు చేరుకుంటామనుకుంటుండగా ఇంతలోనే రాకాసి అల విరుచుకుపడింది. ఒక్కసారిగా బోటు బోల్తాపడటంతో అందులోని పది మంది మత్స్యకారులు సముద్రంలో చెల్లా చెదురుగా పడిపోయారు. అరుపులు, కేకలు... ఎవరు ఎక్కడున్నారో అర్థం కాని పరిస్థితి. మొత్తానికి అందరూ ఈత కొట్టుకుంటూ సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేట తీరంలో జరిగిందీ ఘటన.
boat capsized
పడవలో ఉన్న 10మంది మత్స్యకారులు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నామని తెలియజేశారు. గ్రామస్థులకు సమాచారం అందించి.. జేసీబీ సాయంతో బోటును ఒడ్డుకు లాగినట్టు బాధితులు తెలిపారు. రూ.15 లక్షల వరకు నష్టం వాటిల్లిందని.. ప్రభుత్వం స్పందించి పరిహారం అందించాలని బాధితులు కోరారు.
ఇవీ చదవండి: