Road Built by Villagers: ఆ గ్రామానికి రాకపోకలు సాగించేందుకు రోడ్డు సక్రమంగాలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురయ్యారు. పలుమార్లు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. గ్రామంలోని యువకులు నిరసనలు ఉద్ధృతం చేయడంతో అధికారులు గుత్తేదారుల ద్వారా కంకరను హుటాహుటిన తోలించారు. పనులు చేయకుండా వారం రోజులుగా జాప్యం చేస్తుండడంతో, గ్రామానికి చెందిన యువకులే కంకరను చదును చేసి రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో చోటు చేసుకుంది. చిలమత్తూరు మండలం తమ్మినాయన పల్లి గ్రామం నుండి దేమకేతేపల్లి వరకు సరైన రోడ్డు మార్గం లేక తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
అధికారుల నిర్లక్ష్యం, నడుం బిగించిన యువత
They built their own road తమ గ్రామ రోడ్డు మరమ్మతులు చేయాలని గ్రామస్థులంతా ఎన్నోసార్లు విన్నవించుకున్నారు. యువత ఆధ్వర్యంలో అనేకసార్లు ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. చివరకు అధికారులు కాంట్రాక్టర్కు పనులు అప్పగించారు. దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్న విధంగా కాంట్రాక్టర్ పనులు ప్రారంభించలేదు. చివరకు యువకులే తలో చెయ్యి వేసి ఊరికి వాళ్లే రోడ్డు వేసుకున్నారు.
పలుమార్లు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఎట్టకేలకు అధికారులు స్పందించారు. రోడ్డు పనులను గుత్తేదారులకు అప్పగించారు. కాంట్రాక్టర్ మాత్రం రోడ్డు వేసేందుకు కంకరను కుప్పలుగా రోడ్డు మీద వేసి అలాగే వదిలేశారు. దాంతో రాకపోకలకు మరింత ఇబ్బందికరంగా మారింది. వారం రోజులు గడుస్తున్నా.. రోడ్డుపనులు ప్రారంభించలేదు. దీంతో విసుగు చెందిన యువకులంతా కలిసి వారే స్వయంగా పనులు ప్రారంభించారు. కాంట్రాక్టర్ వేసిన కంకర కుప్పలను చదును చేసి తమ్మినాయనపల్లి నుంచి దేవకేతపల్లి వరకు ఉన్న రెండు కిలోమీటర్ల మేర రాకపోకలు సాగించే విధంగా రోడ్డు పనులు చేసుకున్నారు. ఈ ఘటన అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోందని పలువురు ఆరోపిస్తున్నారు.
ఇవీ చదవండి: