ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సొమ్ము చెల్లించినా రుణ యాప్‌ వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన యువకుడు - సత్యసాయి జిల్లా తాజా వార్తలు

Loan app: రుణ యాప్‌ నిర్వాహకుల వేధింపులు తట్టుకోలేక శ్రీ సత్యసాయి జిల్లాలో ఓ యువకుడు.. పోలీసులను ఆశ్రయించాడు. తీసుకున్న మొత్తానికి రెట్టింపు చెల్లించినా.. వేధిస్తున్నారని బాధితుడు వాపోయాడు. అసలేం జరిగిందంటే..?

Loan app
రుణ యాప్‌పై ఫిర్యాదు

By

Published : Sep 16, 2022, 12:38 PM IST

Loan app: ఆన్​లైన్ యాప్​ల నిర్వహకుల అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. రుణయాప్​ల నిర్వహకులు చేస్తున్న ఆగడాలను భరించలేక రుణగ్రస్తులు బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు ఇప్పటికే వెలుగుచూశాయి. తాజాగా శ్రీసత్యసాయి పుట్టపర్తి జిల్లా నల్లచెరువు మండలం గాడేఖాన్ పల్లికి చెందిన యువకుడు.. ఆన్​లైన్ రుణయాప్ నిర్వహిస్తున్న వారి వేధింపులు భరించలేక పోలీసులను ఆశ్రయించారు. గాజేఖాన్ పల్లికి చెందిన నాగేంద్ర హ్యాండీయాప్ ద్వారా రుణం తీసుకున్న మొత్తానికి రెట్టింపు మొత్తం ఇప్పటికే చెల్లించారు. అయిన్నప్పటకీ అప్పు చెల్లించని పక్షంలో కుటుంబ సభ్యుల ఫొటోలు మార్పింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేస్తామని యాప్ ప్రతినిధులు బెదిరించారని వాపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వరలక్ష్మి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details