YCP LEADER SUICIDE ATTEMPT : శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్‌కు సొంత పార్టీ నేతల నుంచే నిరసన సెగ తగిలింది. ‘గడప గడపకు మన ప్రభుత్వం’లో భాగంగా ఎమ్మెల్సీ ఇక్బాల్.. చిలమత్తూరు మండలంలోని తుమ్మలగుంటకు వచ్చారు. అయితే, తమ గ్రామానికి రావొద్దంటూ వైసీపీ నాయకుడు, ఎంపీటీసీ నాగమణి భర్త నాగరాజు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. తమకు ప్రాధాన్యత ఇవ్వకుండా గ్రామాల్లో కార్యక్రమాలు నిర్వహించడమేంటని నిలదీశారు. దీంతో పోలీసులు వెంటనే నాగరాజును నిలువరించారు. మరోవైపు తమ నాయకుడు ఆత్మహత్యాయత్నం చేసినా.. తనకేం పట్టనట్టు ఎమ్మెల్సీ కార్యక్రమాలు నిర్వహించడం తగదంటూ పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు.
"మా గ్రామానికి ఎమ్మెల్సీ రావొద్దూ".. గడప గడపలో వైసీపీ నేత ఆత్మహత్యాయత్నం
YCP LEADER SUICIDE ATTEMPT IN GADAPA GADAPA PROGRAM : గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజాప్రతినిధులకు, నాయకులకు ప్రజల నుంచి నిరసన సెగలు, అడ్డగింతలు సాధారణమైపోయాయి. అయితే తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ తమ గ్రామానికి రావొద్దంటూ అదే పార్టీకి చెందిన నాయకుడు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే??
YCP LEADER SUICIDE ATTEMPT
Last Updated : Dec 9, 2022, 3:03 PM IST