ATTACK: శ్రీ సత్య సాయి జిల్లా చిలమత్తూరు మండలం కోడికొండలో వైకాపా, తెదేపా వర్గీయుల మధ్య ఘర్షణ తలెత్తింది. పాత కక్షల నేపథ్యంలో తెలుగుదేశం మాజీ సర్పంచ్ బాలాజీ ఇంటిపైకి వైకాపా వర్గీయులు రాళ్లు రువ్వారు. అడ్డొచ్చిన తెదేపా శ్రేణులను.. కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. క్షతగాత్రులను చిలమత్తూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేర్పించి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కోడికొండలో వైకాపా, తెదేపా వర్గీయుల ఘర్షణ - సత్యసాయి జిల్లా తాజా వార్తలు
ATTACK: పాత కక్షల నేపథ్యంలో తెలుగుదేశం మాజీ సర్పంచ్ బాలాజీ ఇంటిపై.. వైకాపా వర్గీయులు రాళ్లు రువ్వారు. ఈ ఘటన శ్రీ సత్య సాయి జిల్లా చిలమత్తూరు మండలం కోడికొండలో జరిగింది.
కోడికొండలో భగ్గుమన్న పాత కక్ష్లలు.. వైకాపా, తెదేపా వర్గీయుల ఘర్షణ