President Draupadi Murmu Visited Yadadri: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణ రాష్ట్రం యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానికి వచ్చిన రాష్ట్రపతికి మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్‌రెడ్డి, సత్యవతి రాఠోడ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతతో పాటు ఆలయ వర్గాలు ఘనంగా స్వాగతం పలికారు. రాష్ట్రపతి వెంట గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వచ్చారు. యాదాద్రి ఆలయ అర్చకులు మంగళ వాద్యాలు, పూర్ణకుంభతో ద్రౌపది ముర్ముకు స్వాగతం పలికారు.
యాదాద్రిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేక పూజలు
President Draupadi Murmu Visited Yadadri: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణ రాష్ట్రం యాదాద్రిలో పర్యటించారు. హైదరాబాద్ నుంచి గవర్నర్ తమిళిసైతో కలిసి ప్రత్యేక హెలికాప్టర్‌లో యాదగిరిగుట్ట చేరుకున్న రాష్ట్రపతికి మంత్రులు, ఆలయ అధికారులు స్వాగతం పలికారు. మంగళవాయిద్యాలు, పూర్ణకుంభంతో అర్చకులు రాష్ట్రపతిని ఆహ్వానించారు. అనంతరం శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారిని ద్రౌపదీ ముర్ము దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు
యాదాద్రి
గర్భాలయంలో యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని రాష్ట్రపతి దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అర్చకులు చతుర్వేద ఆశీర్వచనాలు అందించారు. యాదాద్రి ఆలయ క్షేత్రాన్ని రాష్ట్రపతి పరిశీలించారు. అద్భుతమైన శిల్పకళను చూసి ఆశ్చర్యపోయారు. యాదాద్రి పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు బయల్దేరి వెళ్లారు.
ఇవీ చదవండి: