మాకు పథకాలు అందించండి.. మునిమడుగులో ఎమ్మెల్యే, ఎంపీలకు మహిళల మొర - సత్యసాయి జిల్లాలో గడప గడపకు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శంకరనారాయణ
మునిమడుగులో ఎమ్మెల్యే శంకరనారాయణ, ఎంపీ గోరంట్ల మాధవ్‌లకు స్థానికులు సమస్యలతో స్వాగతం పలికారు. మహిళలు తమకు ప్రభుత్వ పథకాలు అందడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఇళ్లు మంజూరు చేయాలని కోరారు.
Woman request to MLA: తమకు పథకాలు అందడం లేదని పలువురు మహిళలు ఎమ్మెల్యే శంకరనారాయణ, ఎంపీ గోరంట్ల మాధవ్‌కు మొర పెట్టుకున్నారు. సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం మునిమడుగులో నిర్వహించిన 'గడప గడప'కు కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. గ్రామంలో దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్న సుబ్బరత్నమ్మ అనే మహిళ.. తనకు ఇల్లు మంజూరు చేయాలని కోరారు. తన తండ్రి ఆంజనేయులు మూడేళ్ల క్రితం చనిపోయినా ఇప్పటివరకు జగనన్న బీమా అందలేదని... ఆయన కుమారుడు శంకర్ ఎమ్మెల్యేకు తెలిపారు. సమస్యను పరిశీలించి పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అయితే అనంతపురం బీమా కార్యాలయాన్ని సంప్రదిస్తే.. డబ్బులు లేవని చెబుతున్నారని శంకర్ వాపోయారు.