Womens with councilor శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో ఆదివారం భారీ వర్షం పడటంతో 17వ వార్డు పరిధిలోని పలు ఇళ్లలోకి మురుగు నీరు చేరింది. సమస్యను వైకాపా కౌన్సిలర్ మాజాన్‌కు చెప్పడానికి స్థానికులు పలుమార్లు ఫోన్ చేశారు. ఫోన్ ఎత్తకపోవడంతో మహిళలు ఆదివారం ఆమె ఇంటి వద్దకు వెళ్లి ప్రశ్నించారు. ‘నాతో కొట్లాడాల్సిన పనిలేదు. డబ్బు తీసుకొని ఓటేసిన మీకు నన్ను నిలదీసే, ప్రశ్నించే హక్కు లేదు. ఇక్కడి నుంచి వెళ్లిపోండి’ అంటూ ఆమె మహిళలపై విరుచుకుపడ్డారు. ‘ఎవరికి డబ్బులిచ్చావ్? ఏం మాట్లాడుతున్నావ్’ అంటూ మహిళలు కౌన్సిలర్‌పై తిరగబడ్డారు. మళ్లీ ఓటు అడగడానికి వస్తే బుద్ధి చెబుతామంటూ హెచ్చరించారు. ఇళ్లలోకి నీరు వచ్చి తాము ఇబ్బందులు పడుతుంటే ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని రహమత్‌పురం వాసులు వాపోయారు.
Womens with councilor డబ్బు తీసుకొని ఓటేశారంటూ మహిళలపై కౌన్సిలర్ ఆగ్రహం
Womens with councilor సమస్యలు తీర్చాలని వేడుకోవడానికి వెళ్లిన మహిళలపై ఓ కౌన్సిలర్ విరుచుకుపడ్డారు. డబ్బులు తీసుకుని ఓటేసిన మీకు ప్రశ్నించే హక్కు లేదంటూ అవమానించారు. ఆగ్రహించిన మహిళలు ఎవరికి డబ్బులిచ్చావంటూ మండిపడ్డారు. మళ్లీ ఓటు అడగటానికి వస్తే తగిన బుద్ధి చెబుతామని వెనుతిరిగారు.
కౌన్సిలర్‌తో మహిళల వాగ్వాదం
Last Updated : Aug 29, 2022, 10:37 AM IST